
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘మనం’ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అసలు ఈ సినిమా ఎలా మొదలైంది అనే ఆసక్తికర విషయాన్ని నాగార్జున తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మేము ముగ్గురం కలిసి నటించబోయే మల్టీ స్టారర్ సినిమా కోసం చాలా కథలు వింటున్నాం. అదే సమయంలో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి ఫోన్ చేసి మనం స్టొరీ ఒకటి ఉంది అది మీకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది, ఒకసారి వినమని నన్ను అడిగారు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ వచ్చి కథ చెప్పడం, అది మాకు బాగా నచ్చేయడం వెంట వెంటనే జరిగిపోవడంతో’ మనం మొదలైందని చెప్పాడు.
మే 23న రిలీజ్ కానున్న ‘మనం’ సినిమాకి మే 22న స్పెషల్ ప్రీమియర్స్ ఉన్నాయి. సమంత, శ్రియ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

