రజనీ సినిమాలో నితిన్ హీరోయిన్ ?

రజనీ సినిమాలో నితిన్ హీరోయిన్ ?

Published on Jun 4, 2018 1:28 PM IST

రజనీకాంత్, కార్తిక్ సుబ్బరాజ్ ల సినిమాపై రోజు రోజుకు ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టులో ఇప్పటికే ప్రతినాయకుడిగా స్టార్ నటుడు విజయ్ సేతుపతి, ఇంకొక కీలక పాత్రలో మరొక పాపులర్ నటుడు బాబీ సింహ నటిస్తుండగా ఇప్పుడు హీరోయిన్ మేఘా ఆకాష్ కూడ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేయనుందనే టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రంలో యువ నటుడు సనంత్ కు జోడీగా మేఘా ఆకాష్ కనిపించే అవకాశముందని తమిళ సినీ వర్గాల టాక్. తమిళంలో ‘ఎన్నై నొక్కి పాయుమ్’ చిత్రంలో నటించిన మేఘా ఆకాష్ తెలుగులో నితిన్ తో ‘లై, ఛల్ మోహన్ రంగ’ వంటి వరుస సినిమాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇకపోతే త్వరలో మొదలుకానున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు