లేటెస్ట్…నితిన్ “రాబిన్‌హుడ్‌” రిలీజ్ డేట్ ఫిక్స్!

లేటెస్ట్…నితిన్ “రాబిన్‌హుడ్‌” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Apr 17, 2024 12:18 PM IST


టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ రాబిన్‌హుడ్‌ (Robinhood). ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి బిగ్ అప్డేట్ ను మేకర్స్ నేడు శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా వెల్లడించారు.

ఈ చిత్రాన్ని డిసెంబర్ 20, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. రిలీజ్ చేసిన సరికొత్త పోస్టర్ లో హీరో నితిన్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. రాశి ఖన్నా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ లు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు