అమలాపురంలో సందడి చేస్తున్న నితిన్

అమలాపురంలో సందడి చేస్తున్న నితిన్

Published on Jun 9, 2018 7:30 PM IST

Nithin
హీరో నితిన్ చేస్తున్న తాజా చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. నిర్మాత దిల్ రాజు తన బ్యానర్లోని సూపర్ హిట్ చిత్రం ‘శతమానం భవతి’కి ఫాలో అయిన ఫ్యామిలీ ఎంటెర్టైనర్ అనే ఫార్ములానే ఈ సినిమా విషయంలోనూ పాటిస్తున్నారు. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమలాపురంలో జరుగుతోంది. ఈ షూట్లో నితిన్ తో పాటు రాశీఖన్నా, నందిత శ్వేత, ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, గిరిబాబు, ఆమని వంటి ఇతర ముఖ్య తారాగణం కూడ పాల్గొంటున్నారు. నటుడు నరేష్ మాట్లాడుతూ సినిమా చాలా బాగా వస్తోందని, తమ ఖాతాలో మరొక హిట్ ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 9వ తేదీన విడుదలచేయనున్నారు.

తాజా వార్తలు