పదేళ్ల తరువాత నితిన్ మళ్ళీ ఆ హీరోయిన్ తో…?

పదేళ్ల తరువాత నితిన్ మళ్ళీ ఆ హీరోయిన్ తో…?

Published on Jul 8, 2019 3:42 PM IST

యంగ్ హీరో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాప్రకాష్ వారియర్‌ హీరో హీరోయిన్లుగా విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకున్న ఈ చిత్రం, త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నితిన్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్న నేపథ్యంలో ఆ మూడవ హీరోయిన్ గా గోవా బ్యూటీ ఇలియానాను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. గతంలో వీరిద్దరూ కలిసి 2009 లో వచ్చిన “రెచ్చిపో” చిత్రంలో కలిసి నటించారు. ఒకవేళ ఈ మూవీలో కనుక ఇలియానా నటిస్తే 10ఏళ్ల తరువాత మళ్ళీ వీళ్లిద్దరు కలిసి నటించినట్లవుతుంది.

2012లో అల్లు అర్జున్,త్రివిక్రమ్ కంబినేషన్లో వచ్చిన “జులాయి” మూవీ తరువాత ఇలియానా తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడే మకాం వేసింది. మళ్ళీ ఇటీవల రవి తేజ హీరోగా వచ్చిన “అమర్ అక్బర్ ఆంటోని” చిత్రంలో ఇలియానా కనిపించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు