యంగ్ హీరో నిఖిల్, స్వాతి జంటగా నటించిన ‘కార్తికేయ’ సినిమా అత్రైలర్ ని ఇటీవలే రిలీజ్ చేసారు. ఇప్పటికే ట్రైలర్ చూసిన వారందరూ ట్రైలర్ చాలా కొత్తగా ఆసక్తికరంగా ఉందనడంతో ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పటి వరకూ ఈ ట్రైలర్ నచ్చిన వారి జాబితాలో తాజాగా యంగ్ హీరో నితిన్ కూడా వచ్చి చేరారు. తాజాగా ట్రైలర్ చూసిన నితిన్ ‘నిఖిల్ కార్తికేయ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమాకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. టీం అందరికీ అల్ ది బెస్ట్ చెబుతున్నానని’ నితిన్ ట్వీట్ చేసాడు. నితిన్ ప్రస్తుతం కరుణాకరన్ సినిమాలో బిజీగా ఉన్నాడు.
కార్తికేయ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. చందూ మొండేటి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


