అక్కినేని అఖిల్ డెబ్యూ మూవీలో నితిన్ గెస్ట్ రోల్..?

Akhil
అక్కినేని నట వారసుడు అఖిల్ ఎంట్రీ ఇవ్వబోయే సినిమాకి సర్వం సిద్దమయింది. మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు, వరుస విజయాల వివి వినాయక్ అఖిల్ డెబ్యూ మూవీకి దర్శకత్వం వహిస్తారని 123తెలుగు.కామ్ ప్రేక్షకులకు గతంలో తెలియజేశాం. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నితిన్ తండ్రి, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిల్మ్ నగర్ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నితిన్ అతిధి పాత్రలో కనిపించనున్నాడట.

నాగార్జున ‘డమరుకం’ సినిమాకి కథ అందించిన రచయిత వెలిగొండ శ్రీనివాస్, అఖిల్ సినిమాకు కథ అందిస్తున్నారు. కోన వెంకట్ – గోపి మోహన్ ద్వయం స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తున్నారు. నవంబర్ నెలలో సినిమా ఓపెనింగ్ జరుగుతుందని సమాచారం. మూవీ యూనిట్ నవంబర్ 15వ తేదిని పరిశీలిస్తున్నట్టు సమాచారం. హీరోయిన్, ఇతర టెక్నీషియన్ల ఎంపిక జరుగుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ వార్త నిజమో..? కాదో..? త్వరలో తెలుస్తుంది.

Exit mobile version