
వరుసగా రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో హిట్స్ అందుకున్న యంగ్ నితిన్ మొదటి సాటి మాటలతో మాయ చేసే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి చేయనున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘అ..ఆ’. . ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ అనేది ఈ టైటిల్ కి ఉపశీర్షిక. సెప్టెంబర్ 24న అధికారికంగా లాంచ్ అయిన ఈ సినిమా నేటి నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని ఇదివరకే తెలియజేశాం. అనుకున్నట్టుగానే నితిన్ త్రివిక్రమ్ లు ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో అ..ఆ మొదటి షెడ్యూల్ ని స్టార్ట్ చేసారు.
ఇక నుంచి ఏ మాత్రం లాంగ్ గ్యాప్ లేకుండా కంటిన్యూగా సినిమాని షూట్ చేసి జనవరికల్లా సినిమాని ఫినిష్ చేసి లవర్స్ డే కానుకగా ప్రేమికుల రోజున ఈ సినిమాని రిలీజ్ చేయడానికి షెడ్యూల్ చేసారు. నితిన్ సరసన అందాల భామ సమంతతో పాటు తమిళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా హీరోయిన్ గా కనిపించనుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమా ద్వారా అనిరుద్ తెలుగులోకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.