మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో నడిచిన భీష్మ రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డు కలెక్షన్స్ వైపుగా దూసుకుపోతుంది. మొదటిరోజు నైజాంలో 2.21 కోట్ల షేర్ రాబట్టిన భీష్మ శని, ఆదివారాలు అదే జోరు కొనసాగించింది. దీనితో వీకెండ్ ముగిసే నాటికి 5.93 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఉత్తరాంధ్రలో మూడు రోజులకు 1.79 కోట్ల షేర్ వసూలు చేసింది. గుంటూరు 1.37 కోట్లు, కృష్ణ 0.92 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక చాలా ఏరియాలలో భీష్మ బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది. దీనితో భారీ లాభాల దిశగా సాగుతుంది.
మూడు రోజులలోనే భీష్మ ఆంధ్రా మరియు తెలంగాణాలలో కలిపి 14.89 కోట్ల షేర్ రాబట్టి అబ్బురపరిచింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిపి 19.5కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ భీష్మ జరిపినట్లు సమాచారం. దర్శకుడు వెంకీ కుడుముల యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది.
మూడు రోజులకు ఏరియాల వారీగా ఏపీ/తెలంగాణా వసూళ్ల వివరాలు…
| ఏరియా | కలెక్షన్స్ |
| నైజాం | రూ. 5.93 కోట్లు |
| ఉత్తరాంధ్ర | రూ. 1.79 కోట్లు |
| సీడెడ్ | రూ. 2.24 కోట్లు |
| ఈస్ట్ | రూ. 1.20 కోట్లు |
| వెస్ట్ | రూ. 0.88 కోట్లు |
| కృష్ణ | రూ. 0.92 కోట్లు |
| గుంటూరు | రూ. 1.37 కోట్లు |
| నెల్లూరు | రూ. 0. 48 కోట్లు |
| ఏపీ/ తెలంగాణా మూడు రోజుల షేర్ | రూ. 14.89 కోట్లు |


