
ఈ ఏడాది అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘S/O సత్యమూర్తి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి హిట్ అందుకున్న డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ తన తదుపరి సినిమా విషయంలో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ విషయంలో పలు హీరోల పేర్లు వినిపించాయి. కానీ గత కొద్ది రోజులుగా యంగ్ హీరో నితిన్ తో త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కానీ కచ్చితమైన క్లారిటీ లేదు.
కానీ తాజాగా అందిన కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివా నెక్స్ట్ మూవీ నితిన్ తోనే ఉంటుంది. ఇప్పటికే త్రివిక్రమ్ నితిన్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా సరిపోయే ఓ స్టొరీ లైన్ నితిన్ చెప్పడం, ఆ స్టొరీ లైన్ నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అలాగే ఈ సినిమాని గతంలో త్రివిక్రమ్ తో కలిసి జులాయి, సినిమాలు చేసిన హారిక హాసిని క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. త్రివిక్రమ్ తో నితిన్ సినిమా అనగానే అందరూ నితిన్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం నితిన్ అక్కినేని అఖిల్ తో చేస్తున్న సినిమా ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు.

