పూజాకార్యక్రమాలతో ప్రారంభమైన ‘నిత్యకళ్యాణం పచ్చ తోరణం’

పూజాకార్యక్రమాలతో ప్రారంభమైన ‘నిత్యకళ్యాణం పచ్చ తోరణం’

Published on Apr 13, 2021 10:00 AM IST

nia

సి.హెచ్.సత్య సుమన్ బాబు హీరోగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘నిత్యకళ్యాణం పచ్చ తోరణం’. ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ నగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం 11 గంటలకు ఈ చిత్ర స్క్రిప్ట్ కు పూజాకార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 25 నుంచి నెల్లూర్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత అరకు, బెంగళూరులో జరిగే షెడ్యూల్స్ లో చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారు. ఆగస్ట్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చిత్ర యూనిట్ తెలియజేసింది.

జి రవితేజ సమర్ఫణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్, నిర్మిస్తుండగా.. సి.హెచ్.సత్య సుమన్ బాబు హీరోగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ఇది. సత్యసుమన్ బాబుకు ఇది హీరోగా రెండో సినిమా. హీరోయిన్ వివరాలను త్వరలోనే తెలియజేయబోతోన్న ఈ చిత్రంలో సుమన్,షియాజీ షిండే, చలపతి, నరేష్, అన్నపూర్ణమ్మ ఇతర కీలక పాత్రల్లో నటించబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు