‘జయలలిత’ బయోపిక్ గురించి మొదటిసారిగా నిత్యా మీనన్.. !

Published on Jan 18, 2019 12:00 am IST

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్ తో బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జయలలితగారి పాత్రలో టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తోంది.

కాగా ‘ది ఐరన్ లేడీ’లో జయలలితగారి పాత్రలో నటించడం గురించి మొదటిసారిగా నిత్యా మీనన్ మాట్లాడుతూ.. జయలలితగారి పై ఉన్న అభిమానం, గౌరవమే నన్ను ఆమె పాత్రలో నటించేలా చేసిందని.. ఆమె జీవితం గురించి తెలుసుకుంటుంటే ఆమె పై అభిమానం రెట్టింపు అవుతుందని.. నిజంగా రాజకీయాల్లో ఆమె సాధించిన విజయాలు ఇంకెవ్వరి వల్ల సాధ్యం కావు అని నిత్యా మీనన్ చెప్పుకొచ్చింది.

ఇటీవలే జయలలిత పాత్రలో ఉన్న నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ లుక్ లో నిత్యా మీనన్ అచ్చం జయలలిత లాగా చాలా బాగా ఆకట్టుకుంది. ఇక జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే నిత్యామీనన్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని దర్శకనిర్మాతలతో అమ్మ అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి జయలలిత పాత్రలో నిత్యామీనన్ ఎలా నటిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More