‘ఈగ’ సుధీప్ తో జోడీ కట్టనున్న నిత్యా మీనన్

Nitya-menon
సౌత్ లో క్రేజ్ తో పాటు తను సినిమా చేస్తే కచ్చితంగా హిట్ అవుతుంది అన్న ఇమేజ్ ఉన్న హీరోయిన్ మలయాళ కుట్టి నిత్యా మీనన్. ఈ ఏడాది మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఓకే బంగారం, S/O సత్యమూర్తి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నిత్యా మీనన్ త్వరలోనే రుద్రమదేవి సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనుంది. ఇది కాకుండా రీసెంట్ గా నిత్యా మీనన్ ఓ బిగ్ బడ్జెట్ ద్వి భాషా చిత్రానికి సైన్ చేసింది. ఈ సినిమాలో ‘ఈగ’ ఫేం సుధీప్ హీరోగా నటించనున్నాడు. సుదీప్ కెరీర్లో మంచి హిట్ గా నిలిచిన కన్నడ సినిమా ‘కోటిగొబ్బ’.

ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా ‘కోటిగొబ్బ 2’ ని ప్లాన్ చేసారు. సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని ఒకేసారి కన్నడ, తమిళ భాషల్లో రూపొందించనున్నారు. తమిళంలో కూడా నిత్య మీనన్ బాగా ఫేమస్ అవడంతో సుధీప్ సరసన సెలెక్ట్ చేసారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇది. ప్రస్తుతం సూర్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న నిత్య త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెడుతుంది.

Exit mobile version