విడుదల తేది ఖరారు చేసుకున్న నితిన్-నిత్యా ల “ఇష్క్”

విడుదల తేది ఖరారు చేసుకున్న నితిన్-నిత్యా ల “ఇష్క్”

Published on Jan 7, 2012 4:19 PM IST


నితిన్ మరియు నిత్యా మీనన్ ల కలయిక లో వస్తున్న “ఇష్క్” చిత్రం ఫిబ్రవరి 10 న విడుదలకు సిద్దమయింది. ఈ చిత్రాన్ని శ్రేష్ట మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రఖ్యాత ఛాయా గ్రాహకుడు పి.సి.శ్రీరాం సినిమాటోగ్రఫీ అందించారు. ఈ మధ్యనే ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్ర ఆడియో ఈ నెల 15 న కాని 16 న కాని జరుపుకోనుంది.

ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. ఈ ప్రేమ కథ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన పి.సి.శ్రీరాం గారు చిత్ర విజయం పై చాలా ధీమాగా ఉన్నారు. నితిన్ కి కూడా విజయం వచ్చి చాలా రోజులు అయ్యింది ఈ చిత్రం తో అయిన విజయం సాదించాలి అని నితిన్ అనుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు