యాక్షన్ మోడ్ లో నితిన్ ‘రాబిన్ హుడ్’

యాక్షన్ మోడ్ లో నితిన్ ‘రాబిన్ హుడ్’

Published on Mar 2, 2024 1:12 AM IST

యువ నటుడు నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. గతంలో వెంకీ, నితిన్ ల కాంబినేషన్ లో వచ్చిన భీష్మ మూవీ పెద్ద విజయం అందుకోవడంతో అందరిలో దీని పై మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల రిలీజ్ అయిన రాబిన్ హుడ్ గ్లింప్స్ ఆకట్టుకుని ఆ అంచనాలు మరింతగా పెంచేసిందని చెప్పాలి.

ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో నితిన్ ఒక దొంగ పాత్ర చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. విషయం ఏమిటంటే, తాజాగా హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించి పవర్ ప్యాక్డ్ యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో ఇంటర్వెల్ ఎపిసోడ్ ని గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ బ్లాక్ ని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు