నితిన్ న్యూ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్

నితిన్ న్యూ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్

Published on Mar 29, 2024 11:01 PM IST

టాలెంటెడ్ యాక్టర్ నితిన్ ఇటీవల ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నారు. ఇక ప్రస్తుతం వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ మూవీ తో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీకి తమ్ముడు అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

విషయం ఏమిటంటే, రేపు నితిన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ యొక్క టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని ఉదయం 9 గం. లకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు