
‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మలయాళ కుట్టి నిత్యా మీనన్ కి ఒక్క తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళంలో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ భామ ప్రస్తుతం హీరోయిన్ గా చాలా బిజీగా ఉంది. తను నటించిన ‘ఓకే బంగారం లేదా ఓకే కన్మణి’ ఈ నెల 17న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే సక్సెఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నిత్యా మీనన్ కి ఓ స్టార్ హీరోకి చెల్లెలిగా నటించే అవకాశం వచ్చింది. మరి దీన్ని అంగీకరిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే మన తమిళ స్టార్ తల అజిత్. అజిత్ హీరోగా ‘శౌర్యం’ ‘వీరం’ ఫేం శివ డైరెక్షన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా పూర్తి అన్న – చెల్లెళ్ళ సెంటిమెంట్ తో తెరకెక్కనుంది. అజిత్ కి చెల్లిగా నిత్యా మీనన్ అయితే బాగుంటుందని ఈ చిత్ర టీం నిత్యాని అప్రోచ్ అయ్యారు. ఒక వేల నిత్యా మీనన్ నో చెబితే శ్రీ దివ్యని కూడా అప్రోచ్ అవ్వాలని ఈ చిత్ర టీం ఆలోచిస్తోంది. మరి నిత్యా మీనన్ అజిత్ కి సిస్టర్ గా నటించడానికి అంగీకరిస్తుందా.? లేకా ఆ ఛాన్స్ ఇంకెవరికన్నా ఇస్తుందా అన్నది చూడాలి.