తమిళ రాజకీయాలలో జయలిత అనే పేరు ఒక సంచలనం. నటిగా జీవితం మొదలుపెట్టి ముఖ్యమంత్రిగా ఎదిగేవరకు జరిగిన ఆమె ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక జయలలిత మరణం తరువాత అనేక మంది ఆమె బయో పిక్ తీయడానికి ముందుకొచ్చారు. జయలలిత జీవితం ఆధారంగా రమ్యకృష్ణతో గౌతమ్ మీనన్ వెబ్ సిరీస్ తీస్తుండగా, నిత్యా మీనన్ జయలితగా దర్శకుడు ప్రియదర్శిని ఐరన్ లేడీ అనే టైటిల్ తో మరో చిత్రం తీస్తున్నారు. ఇక భారీ బడ్జెత్ తో తలైవి అనే మరో బయో పిక్ తెరకెక్కుతుంది.
తలైవి చిత్రంలో కంగనా రనౌత్ జయలలిత పాత్రలో కనిపిస్తుండగా ఇందుకూరి విష్ణు వర్ధన్ నిర్మిస్తున్నారు. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. కాగా ఇటీవల ఈ మూవీ నుండి జయలలితగా కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేశారు. ఐతే బక్క పలుచగా ఉండే కంగనా జయలలిత పాత్రకు అంతగా నప్పలేదనే చెప్పాలి. హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్స్ పనిచేసినప్పటికీ అంతగా మెప్పించలేకపోయారు.
కాగా మరో చిత్రంలో జయలలితగా చేస్తున్న నిత్యా మీనన్ ఆమె పాత్రకే నేనే పర్ఫెక్ట్ అని కామెంట్ చేశారు. ఇక్కడ మిగతా రమ్య కృష్ణ, కంగనా పేరు ఆమె ప్రస్తావించనప్పటికీ వారిని ఉద్దేశించే ఆమె అన్నారు అని ఇండస్ట్రీ టాక్. మరి ఈ విషయం కంగనాకు, మరియు ఆమె అక్క రంగోలి కి చేరితే నిత్యా పరిస్థితి ఏమిటో చూడాలి. పెద్ద పెద్ద నిర్మాతలు, హీరోలనే తమ మాటలతో ముప్పతిప్పలు పెట్టిన వీరికి నిత్యా ఒక లెక్క.


