బన్నీ సినిమాలో తనది గ్లామర్ రోల్ అంటున్న హీరోయిన్

Published on Sep 12, 2019 9:00 pm IST

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడవ చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఇందులో పూజా హెగ్డే ప్రధాన కథానాయిక కాగా నివేత పేతురాజ్ ఒక ముఖ్య పాత్ర చేస్తోంది. తన పాత్ర గురించి మాట్లాడిన అమె సినిమాలో తనది గ్లామర్ రోల్, స్క్రీన్ మీద మునుపటి సినిమాల్లో కంటే అందంగా కనిపిస్తానని,
కథకు అవసరం కాబట్టే ఆ పాత్ర చేశానని చెప్పుకొచ్చింది. దీన్నిబట్టి బన్నీ సినిమాలో గ్లామర్ ట్రీట్ బోలెడంత ఉంటుందని అర్థమవుతోంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇంకా ఇందులో టబు, సుశాంత్, జయరామ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More