ఇది ‘సాహో’కి బాగా కలిసొచ్చే విషయం

ఇది ‘సాహో’కి బాగా కలిసొచ్చే విషయం

Published on Sep 4, 2019 6:22 PM IST

గత శుక్రవారం భారీ ఎత్తున విడుదలైన ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్ల గ్రాస్ ఖాతాలో వేసుకుంది. హిందీలో రూ.100 కోట్లు దాటేసిన ఈ చిత్రం తెలుగునాట కూడా మొదటి నాలుగు రోజులు భారీగా వసూళ్లను రాబట్టింది. నిన్న ఐదవ రోజు మాత్రం కలెక్షన్స్ కొంత నెమ్మదించాయి. ఐదు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ. 70 కోట్లకు పైగానే షేర్ అందుకుంది ఈ సినిమా.

ఇక ఈరోజు, రేపు కూడా వర్కింగ్ డేస్ కావడంతో ఆక్యుపెన్సి తగ్గే అవకాశం ఉంది. కాకపోతే ఈ వారం చెప్పుకోదగిన పెద్ద సినిమాల విడుదల లేకపోవడం’సాహో’కు బాగా కలిసొచ్చే విషయం. ఈ వారం ‘2 హవర్స్ లవ్, జోడి, ఉండిపోరాదే, నీకోసం, వీడే సరైనోడు’ లాంటి చిన్న సినిమాలే వస్తున్నాయి. వీటి వలన ‘సాహో’ కలెక్షన్లకు ఏమాత్రం డోకా ఉండదు. అవేవీ చిత్ర వసూళ్లకు గమవైపుకు తిప్పుకోవు. అలాగే థియేటర్ల సంఖ్య కూడా తగ్గదు. కాబట్టి ఈ వారాంతాన్ని కూడా పూర్తిగా ‘సాహో’ చిత్రమే ఆక్రమించేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు