ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్, రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చెయ్యబోతున్నాడు. త్రివిక్రమ్ సినిమా ఈ నెల 12 నుండి ప్రారంభం కాబోతుండగా రాజమౌళి సినిమా అక్టోబర్ నుండి మొదలు కాబోతోంది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో మీరు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నటించబోతున్నారా అని మీడియా ఎన్టీఆర్ ను అడిగింది.
ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ… ఎన్టీఆర్ బయోపిక్ నుండి తనకు పిలుపు రాలేదని, ఒకవేళ అక్కడి నుండి పిలుపు వస్తే తప్పకుండా ఎన్టీఆర్ బయోపిక్ నటించడానికి సిద్దమని చెప్పకనే చెప్పాడు ఎన్టీఆర్. మునుముందు ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించినా ఆచార్యపోనవసరం లేదని తెలుస్తోంది. తేజ దర్శకత్వం వహిస్తిన్న ఎన్టీఆర్ బయోపిక్ దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


