‘సైరా’ కోసం నరసింహారెడ్డి చరిత్రను మార్చలేదట

Published on Sep 15, 2019 11:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రంపై అభిమానుల్లో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్టోబర్ 2న రానున్న ఈ సినిమా కథ గురించి ఇప్పటికే పలు పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవ చరిత్ర మేరకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ సేనల చేతిలో అతి క్రూరంగా చంపబడతాడు. ఆ అంశాన్ని సినిమాలో చూపించరనే చర్చ నడుస్తోంది.

ఎండుకంటే.. కథానాయకుడు చిరంజీవి కాబట్టి ఆయన పాత్ర మరణించడాన్ని అభిమానులు అంగీకరించలేరని అందుకే దాన్ని మార్చారనే పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ కారణం కొంతవరకు నిజమే అయినా చరిత్రను మార్చడం సబబు కాదు కాబట్టి మెగా టీమ్ సాహసించి నరసింహారెడ్డి వీర మరణాన్నే ముగింపుగా ఎంచుకున్నారట.

ఆ సన్నివేశాలను చాలా భావోద్వేగంతో తెరకెక్కించారని, అవి ప్రేక్షకుల్ని కదిలించేలా ఉంటాయని తెలుస్తోంది. మొత్తం మీద సినిమా ఒక ఏమోషనల్ ట్రీట్ అని తెలుస్తోంది. ఇకపోతే చిత్ర ట్రైలర్ ఈ నెల 18న విడుదలకానుంది. రామ్ చరణ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :

X