కంగారేం లేదు.. ‘సైరా’ ట్రైలర్ సిద్దంగా ఉంది

Published on Sep 17, 2019 3:36 pm IST

‘సైరా’ ట్రైలర్ రేపు వస్తుందా.. రాదా అని అభిమానులు తెగ కంగారుపడిపోయారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ 18 నుండి 22కి వాయిదాపడటంతో ట్రైలర్ కూడా వాయిదాపడుతుందని అనుమానపడ్డారు. కానీ అలాంటిదేం లేదని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ క్లారిటీ ఇచ్చింది.

వాతావరణం అనుకూలించదనే అనుమానంతోనే ప్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేసినట్టు తెలిపిన మేకర్స్ ట్రైలర్ మాత్రం ముందు చెప్పినట్టే రేపు 18వ తేదీన వస్తుందని అన్నారు. దీన్నిబట్టి ఇప్పటికే ట్రైలర్ సిద్దంగా ఉందని తెలుస్తోంది. ఇక ఏ సమయానికి విడుదలవుతుంది అనేది సాయంత్రం కల్లా తెలిసే అవకాశముంది.

సుమారు రూ.270 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :

X
More