బ్రదర్స్ కి హ్యాండిచ్చిన లోకేష్ కనగరాజ్!

ప్రస్తుతం దక్షిణాది సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ దర్శకుల్లో కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు. అయితే లోకేష్ దర్శకునిగానే కాకుండా హీరోగా కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాను నటుడుగా కంటే దర్శకునిగా చేయనున్న సినిమాలు కోసమే ఆడియెన్స్ ఎక్కువ ఎదురు చూస్తున్నారు.

కానీ లోకేష్ లైనప్ లో ఉన్న చిత్రాల్లో ఇద్దరు హీరో బ్రదర్స్ తో క్రేజీ ప్రాజెక్ట్ లు అయోమయంలో పడ్డాయి. అవే సూర్యతో ‘రోలెక్స్’, కార్తీతో ‘ఖైదీ 2’. రెండూ తన సినిమాటిక్ యూనివర్స్ లో చిత్రాలే. అయితే ఈ సినిమాలు ఎప్పుడు మొదలవుతాయి అనే ప్రశ్నకి కార్తీ, సూర్య ఇద్దరి దగ్గరా సమాధానం లేదు.

పైగా లోకేష్ నుంచి కూడా వీటికి అనుకూల సమాధానాలు లేవు. పైగా ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా నెక్స్ట్ విక్రమ్ 2 లు లైన్ లో పెట్టుకున్నాడు. దీనితో ఆ ఇద్దరు అన్నాతమ్ముళ్ళతో సినిమాలు ఎప్పుడు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న గానే మిగిలిపోయింది. సో ఈ సినిమాలు ఎప్పుడు మొదలవుతాయో చూడాలి.

Exit mobile version