ధురంధర్ ఓటీటీ రిలీజ్.. ఆ విషయంపై ఇంకా క్లారిటీ లేదు..!

Dhurandhar

రణవీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్'(Dhurandhar) తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్, బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులన్నీ చెరిపివేసి బాలీవుడ్‌లో సరికొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, తమిళ వెర్షన్లు కూడా అందుబాటులోకి రావడంతో సౌత్ ఆడియన్స్ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే, కన్నడ మరియు మలయాళ ప్రేక్షకులకు మాత్రం నిరాశే ఎదురైంది. ఈ రెండు భాషల డబ్బింగ్ వెర్షన్ల విడుదలపై నెట్‌ఫ్లిక్స్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ సినిమా సీక్వెల్ ‘ధురంధర్ 2’ను మార్చి 19, 2026న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో మొదటి భాగం అన్ని భాషల్లోనూ ఒకేసారి ఓటీటీలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం ఆ రెండు భాషల వెర్షన్లు ఆగిపోవడంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

జియో స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం నటించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందించిన ఈ చిత్రం కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కన్నడ, మలయాళ వెర్షన్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి.

Exit mobile version