‘భరత్ అనే నేను’లో కాంట్రవర్సీలు ఉండవు !

17th, April 2018 - 11:34:58 AM

మహేష్ బాబు మొదటిసారి పూర్తిస్థాయి రాజకీయ నైపథ్యంలో చేస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. ఇందులో ప్రిన్స్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనుండటంతో అందరిలోనూ సినిమాపై తీవ్ర ఆసక్తి మొదలైంది. కొందరైతే ప్రస్తుతం ఆంధ్రాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను సినిమాలో ప్రస్తావిస్తారేమో, దాని వలన లేనిపోని వివాదాలు తలెత్తుతాయేమోననే సందేహాల్ని కూడ వ్యక్తం చేశారు.

కానీ నిర్మాత డివివి.దానయ్య మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలకు సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదని, సినిమాలో ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయడంగాని, వ్యక్తుల్ని విమర్శించడంగాని జరగలేదని, దర్శకుడు కొరటాల శివ ఎలాంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా సినిమాను రూపొందించారని, చిత్రీకరణకు ముందే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు. ఈ నెల 20న విడుదలకానున్న ఈ చిత్రాన్ని ఎక్కువ మొత్తం థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.