అనుకున్న డేట్ కే రాబోతున్న రామ్ ‘రెడ్’ !

Published on Mar 12, 2020 10:05 pm IST

సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న సినిమా ‘రెడ్’. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లట్లేదు. దాంతో, ఏప్రిల్ 9న విడుదల అవ్వబోతున్న రామ్ ‘రెడ్’ వాయిదా పడుతుందని ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీ మారట్లేదని ఏప్రిల్ 9నే రిలీజ్ అవ్వనుంది.

కాగా సినిమాలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. హీరోయిన్ గా హిట్లు లేని ఈ బ్యూటీ ప్రస్తుతానికి సైడ్ క్యారెక్టర్స్ అండ్ స్పెషల్ సాంగ్స్ తో బండి నెట్టుకొస్తోంది. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరుపుకుంటుంది.

ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్ , మాళవిక శర్మ , అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More