వరుణ్ ని ఒంటరిని చేసిన మెగా హీరోలు

Published on Sep 16, 2019 7:11 pm IST

వరుణ్ తేజ్ మునుపెన్నడూ ఎరుగని గద్దలకొండ గణేష్ గా మాస్ అవతారం ఎత్తాడు. హరీష్ శంకర్ వరుణ్ ని తాజా చిత్రం వాల్మికీలో ఊర మాస్ గ్యాంగ్ స్టర్ గా ప్రజెంట్ చేయనున్నారు. ఈనెల 20న వాల్మీకి ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈనేపథ్యంలో గత రాత్రి ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించడం జరిగింది. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ వేడుకలో దర్శక నిర్మాతలతో పాటు, హీరోయిన్ పూజా, బ్రహ్మనందం, బ్రహ్మజీ వంటి నటులు పాల్గొని సందడి చేశారు.

ఐతే ఈ కార్యక్రమానికి ఒక్క మెగా హీరో కూడా హాజరుకాకపోవడం ఆశ్చర్యం కలిగింది. వేడుకలో ఆ లోటు కొట్టించినట్టు కనిపించింది. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ధరమ్ తేజ్ చివరికి వరుణ్ తండ్రి నాగ బాబు కూడా లేకపోవడం గమనార్హం. దీనివెనుక పెద్ద కారణాలేమీ లేవు లేవులెండి. వచ్చేనెల 2న సైరా విడుదల నేపథ్యంలో హీరో చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్ ఆ పనులలో తనమునకలై ఉన్నారు. ఇక బాబాయ్ పవన్ రాజకీయ వ్యవహారాలలో, ధరమ్ తేజ్ ప్రతిరోజు పండుగే చిత్ర షూటింగ్ లో ఉండటం వలన ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. ఏదిఏమైనా హీరో వరుణ్ వాల్మీకి ప్రీ రిలీజ్ వేడుకలో ఒక్కడే అందరు మెగా అభిమానులను అలరించారు.

సంబంధిత సమాచారం :

X
More