విజయ్ నుండి ఒక్క రూపాయి కూడా సీజ్ చేయలేదట

Published on Feb 7, 2020 1:19 am IST

తమిళ స్టార్ హీరో విజయ్ మీద ఐటీ రైడ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో విజయ్ ఇంటి నుండి కొంత డబ్బును ఐటీ అధికారులు సీజ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇవి కాస్త తీవ్ర దుమారాన్ని రేపాయి. విజయ్ తాజా చిత్రం ‘బిగిల్’ పెద్ద విజయాన్ని సాధించి రూ.300 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు రిపొర్ట్స్ వెలువడ్డాయి. దీంతో ఐటీ శాఖ నిన్న చిత్ర నిర్మాత, సినిమా ఫైనాన్షియర్, విజయ్, లాభాలు ఆర్జించిన డిస్ట్రిబ్యూటర్ల ఇలా మొత్తం 38 చోట్ల సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో ఫైనాన్షియర్ వద్ద లెక్కలు తేలని రూ.77 కోట్లు, పెద్ద మొత్తంలో ఆస్తుల పేపర్లను అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. విజయ్ మాత్రం తన పెట్టుబడుల్ని స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టారని, ‘బిగిల్’ సినిమాకు ఆయన తీసుకున్న పారితోషకాన్ని గురించి విచారణ చేస్తున్నామని ఐటీ కమీషనర్ ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు. ఇందులో విజయ్ ఇంట్లో లెక్కలు తేలని డబ్బు దొరికినట్టు, దాన్ని సీజ్ చేసినట్టు ఎక్కడా చెప్పలేదు. ఇంకా విచారణ కొనసాగుతుండగా ఇంతవరకు విజయ్ చూపిన లెక్కలన్నీ సరిగ్గానే ఉన్నట్టు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :