తెలుగు చిత్రాలలో కనుమరుగు కానున్న ధూమపానం

తెలుగు చిత్రాలలో కనుమరుగు కానున్న ధూమపానం

Published on Nov 28, 2011 9:49 AM IST


చాలా సినిమాల్లో యువ హీరోలు స్టైల్ గా సిగరెట్ తాగుతూ ఉన్న సన్నివేశాల్ని చూసాం.ఇక ముందు ఇలాంటి సన్నివేశాలు కనుమరుగు కానున్నాయా? సెన్సార్ బోర్డు కొత్త నిబందనలు జారీ చేయబోతుంది. ఇందులో ముఖ్యంగా పొగ తాగే సన్నివేశాలు ఉన్న చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇవ్వబడదు. హీరో పొగతాగే సన్నివేశాలుంటే సదరు నటుడితో ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే సందేశాన్ని చిత్ర ప్రారంభానికి ముందు, విశ్రాంతి సమయంలో చెప్పించాలి.

పొగ తాగే సన్నివేశం ఉంటె అందుకు గల కారణాన్ని బలంగా చూపించాలి. ఈ కొత్త నిబంధనలపై చిత్ర పరిశ్రమ సంతృప్తికరంగా లేదు. ప్రముఖ నిర్మాతలు ఈ నిబందనలు సఢలించేల ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు