ఈ వారం కూడా “కల్కి” దే హవా!

ఈ వారం కూడా “కల్కి” దే హవా!

Published on Jul 5, 2024 7:30 PM IST

బాక్సాఫీస్ బుల్డోజర్ ప్రభాస్ నటించిన కల్కి2898AD చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది ఈ చిత్రం. ఈ చిత్రంలో బాలివుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన దీపికా పదుకునే, దిశా పటాని లు ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలివుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు కీలక పాత్రల్లో నటించారు.

ఈ వారం ఎలాంటి చిత్రాలు కూడా రిలీజ్ లేకపోవడం తో కల్కి బాక్సాఫీస్ వద్ద సోలో రన్ ను కంటిన్యూ చేయనుంది. ఈ వీకెండ్ భారీ నంబర్లను నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం భారతీయుడు2 థియేటర్ల లోకి రానుంది. ఈ అవకాశాన్ని కల్కి ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. కల్కి చిత్రం లో బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి అధ్బుతమైన సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు