ఆ సమస్య తీరే వరకు ఏ తెలుగు సినిమా విడుదల కాదు..ఆక్టివ్ తెలుగు నిర్మాతల సంఘం!

ఈ ఏడాది ఊహించని రీతిలో వచ్చిన పెను ప్రమాదం కరోనా. దీని మూలాన ఎన్నో పరిశ్రమలు చిన్నాభిన్నం అయ్యాయి కానీ సినీ పరిశ్రమకు వచ్చిన నష్టం అయితే మరింత దురదృష్టకరం. ఇప్పటికీ కూడా సినిమాను నమ్ముకుని ఉన్నవారి జీవితాలు ఆందోళనకర పరిస్థితుల్లోనే ఉన్నాయి.

అయితే ముఖ్యంగా ఎగ్జిబిటర్లు కూడా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. చాలా మేర థియేటర్స్ కూడా మూతబడ్డాయి.కానీ ఇప్పుడిప్పుడే కొన్ని థియేటర్స్ కూడా తెరుచుకొని డబ్బింగ్ సినిమాలు కూడా స్టార్ట్ అయ్యాయి. మరి దీనితో కొత్త సినిమాల విడుదల పట్ల చాలానే అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో..

తాజా సమాచారం ఒకటి బయటకు వచ్చింది. మేజర్ తెలుగు సినిమాలను నిర్మించే ఆక్టివ్ తెలుగు నిర్మాతల సంఘం వారికి మరియు ఎగ్జిబిటర్లకు మధ్య ఉన్న సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఏ సినిమా కూడా విడుదల చెయ్యకూడదని నిర్ణయం తీసుకున్నారట.

అయితే వారికి మరియు ఎగ్జిబిటర్లకు ఎప్పటి నుంచో పలు చార్జెస్, మరియు రెవెన్యూ షేరింగ్ ఇలా మరిన్ని అంశాల్లో సమస్యలు ఉన్నందున అవి పూర్తిగా క్లియర్ అయ్యే వరకు సినిమాలను విడుదల చెయ్యకూడదని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే వచ్చే క్రిస్మస్ నుంచి పలు నోటెడ్ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. మరి ఆ సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version