ఈ దీపావళికి మనకు తమిళ సినిమాలే దిక్కు

ఈ దీపావళికి మనకు తమిళ సినిమాలే దిక్కు

Published on Oct 21, 2019 12:49 PM IST

తెలుగు జనం ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి, దసరా పండుగలతో పాటు దీపావళి కూడా ఒకటి. ఈ పండుగనాడు అన్ని రకాల వ్యాపారాలతో పాటు సినిమా బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. ప్రేక్షకులు కొత్త సినిమాలేవైనా ఉన్నాయా అని వెతుకుతుంటారు. కానీ ఈ పండుగను మన హీరోలు, నిర్మాతలు పూర్తిగా నెగ్లెక్ట్ చేసినట్టు కనిపిస్తున్నారు.

ఈ యేడాది దీపావళికి తెలుగులో పెద్దవి కాదు కదా ఒక మోస్తరు సినిమా ఒక్కటి కూడా లేకపోవడమే ఇందుకు నిదర్శనం. మన హీరోలెవరూ యేడాది ఆరంభంలో దీపావళికి సినిమా అందించేలా ప్లాన్ చేసుకోలేదు. కానీ తమిళ హీరోలు మాత్రం దీపావళిని గట్టిగానే తీసుకున్నారు. ‘బిగిల్’ సినిమాతో విజయ్, ‘ఖైదీ’తో కార్తి ప్రేక్షకుల్ని పలకరిస్తున్నారు.

ఇవి తెలుగులో కూడా 25వ తేదీనే విడుదలకానున్నాయి. తెలుగు సినిమాలేవీ లేకపోవడంతో ఈ చిత్రాలకు పెద్ద సంఖ్యలో థియేటర్లు లభించాయి. ప్రేక్షకులు కూడా వేరే ఆప్షన్ లేకపోవడంతో ఈ సినిమాలకే వెళ్లాలి. ఫలితంగా రెండు చిత్రాలకి ఓపెనింగ్స్ మంచి స్థాయిలోనే ఉండనున్నాయి. మొత్తానికి ప్రతి పండుగకు కొత్త సినిమా ఏమైనా ఉందా అని వెతుక్కునే మన సినిమా ప్రియులకు ఈ దీపావళికి తమిళ సినిమాలే దిక్కయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు