“హను మాన్” లో అలాంటి సీన్స్ ఏవి ఉండవ్.!

“హను మాన్” లో అలాంటి సీన్స్ ఏవి ఉండవ్.!

Published on Nov 29, 2023 8:00 AM IST

టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు భారీ చిత్రాల్లో సంక్రాంతి రేస్ కి సిద్ధంగా చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మాసివ్ విజువల్ అండ్ యాక్షన్ డ్రామా “హను మాన్”. మరి మన టాలీవుడ్ నుంచి రాబోతున్న మొదటి సూపర్ హీరో సినిమా కావడం పైగా ఫస్ట్ టీజర్ తర్వాత అంచనాలు ఏ లెవెల్ కి వెళ్ళాయో కూడా అందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమాపై ప్రశాంత్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. ఈ సినిమా సంక్రాంతికి తగ్గ ఒక ప్రాపర్ సినిమా అని అలాగే ఈ చిత్రంలో పొగాకు కానీ మద్యంకి సంబంధించి ఒక్క సీన్ కూడా ఉండదు అని ఇదొక క్లీన్ చిత్రమని తెలిపాడు. మరి చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు