‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాదనే వార్త ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ, చిత్ర బృందం ఈరోజు సాయంత్రం ఒక ప్రెస్ మీట్ నిర్వహించి స్పష్టతనిచ్చింది.
భారీ అంచనాలున్న సినిమాకు ట్రైలర్ విడుదల చేయకపోవడం చిత్ర పరిశ్రమలో ఒక వినూత్న ప్రయోగమని చెప్పవచ్చు. ఈ విచిత్ర నిర్ణయం వెనుక అసలు కారణాన్ని హీరో నాని స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం పలు యూనిట్లు ఏకకాలంలో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాయని, అత్యుత్తమ అవుట్‌పుట్‌తో కూడిన ట్రైలర్‌ను సిద్ధం చేయడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
సినిమా పనులే తమకు అత్యంత ప్రాధాన్యమని, అంతేతప్ప ప్రేక్షకులను చిన్నచూపు చూసి ఈ నిర్ణయం తీసుకోలేదని నాని తేల్చిచెప్పారు. సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు చిత్ర బృందమంతా అంకితభావంతో శ్రమిస్తోందని ఆయన తెలిపారు.


