బన్నీ వల్ల ఎన్టీఆర్ కి ఎలాంటి ఇబ్బంది లేనట్టేనా.!

బన్నీ వల్ల ఎన్టీఆర్ కి ఎలాంటి ఇబ్బంది లేనట్టేనా.!

Published on Feb 18, 2024 8:00 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న మాసివ్ అండ్ అవైటెడ్ చిత్రాల్లో స్టార్ హీరోస్ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2” ఒకటి కాగా ఈ బన్నీకి క్లోజెస్ట్ ఫ్రెండ్ మరియు తాను ఆప్యాయంగా బావా అని పిలుచుకునే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామా “దేవర” కూడా ఒకటి అయితే దేవర చిత్రం రీసెంట్ గానే ఏప్రిల్ నుంచి అక్టోబర్ కి పోస్ట్ పోన్ అయినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.

కానీ ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవ్వాలి అనేది మళ్ళీ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మీద ఆధారపడి ఉందని టాక్ వచ్చింది. అయితే ఈ రూమర్స్ పై ఇప్పుడు క్లారిటీ వినిపిస్తుంది. రెండు సినిమాలు కూడా ఆన్ వస్తాయని పుష్ప 2 యూనిట్ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో జూన్ నాటికి టాకీ పార్ట్ అంతా కంప్లీట్ చేసేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నారట. దీనితో సినిమా ఆగస్ట్ లో తప్పకుండ వచ్చేస్తుందని సమాచారం. దీనితో దేవర రిలీజ్ కి ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు