ప్రభాస్ “స్పిరిట్” ఆ వార్తల్లో నిజం లేదు.!

ప్రభాస్ “స్పిరిట్” ఆ వార్తల్లో నిజం లేదు.!

Published on Mar 1, 2024 3:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “సలార్” తో తాను మళ్ళీ సెన్సేషనల్ హిట్ ని అందుకోగా ఈ చిత్రం తర్వాత ఈ ఏడాదిలో మే లో తన గ్రాండ్ వరల్డ్ చిత్రం “కల్కి 2898ఎడి” తో రాబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎంటర్టైనింగ్ చిత్రం “ది రాజా సాబ్” మరో యాక్షన్ ప్రాజెక్ట్ “స్పిరిట్” చిత్రాలు ఉన్నాయి. మరి వీటిలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించనున్న స్పిరిట్ విషయంలో రీసెంట్ గా ఓ రూమర్ బయటకి వచ్చింది.

ఈ చిత్రంతో మళ్ళీ చాలా కాలం తర్వాత ప్రభాస్ సరసన నటి త్రిష కృష్ణన్ నటించబోతుంది అని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో అయితే ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉండగా ఈ చిత్రం క్యాస్ట్ ఇతర వివరాలు మేకర్స్ టైం వచ్చినపుడు అఫీషియల్ గానే అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ చిత్రంతో ప్రభాస్ మొట్ట మొదటిసారిగా పోలీస్ రోల్ లో కనిపించనుండగా టి సిరీస్ వారు పాన్ ఆసియ లెవెల్లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు