పవన్ “ఓజి”..ఆ వార్తల్లో నిజం లేదా!?

పవన్ “ఓజి”..ఆ వార్తల్లో నిజం లేదా!?

Published on Apr 21, 2024 11:30 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామా “ఓజి” కోసం తెలిసిందే. మరి పవన్ కెరీర్ లోనే అత్యధిక అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ అయిపోవచ్చింది. అలాగే పవన్ నుంచి మరికొన్ని రోజులు ఇచ్చినట్టు అయితే సినిమా అయిపోయినట్టే..

అయితే పవన్ డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తుండగా లేటెస్ట్ గా కొన్ని రూమర్స్ ఈ సినిమాపై స్ప్రెడ్ అవుతున్నాయి. దీనితో పవన్ ఈ ఎన్నికల పోలింగ్ తర్వాతే షూటింగ్ జాయిన్ అయిపోతాడు అని వినిపిస్తుంది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. పోలింగ్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాతే పవన్ ఓజి షూట్ లో జాయిన్ కానున్నారని టాక్.

ఓజి సినిమాకి పవన్ వైపు కేవలం 15 రోజుల మేర మాత్రమే షూట్ బ్యాలన్స్ ఉంది. మరి చూడాలి ఎప్పటికి ఇవి కంప్లీట్ అవుతాయో. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు. అలాగే పవన్ ఇండస్ట్రీ హిట్ “అత్తారింటికి దారేది” రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో ఓజి రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు