“రాజా సాబ్” షూట్.. ఆ సీన్స్ లో నిజం లేదు?

“రాజా సాబ్” షూట్.. ఆ సీన్స్ లో నిజం లేదు?

Published on Feb 22, 2024 4:27 PM IST


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మారుతీ తో చేస్తున్న ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు కొనసాగుతూ ఉండగా మెకాన్ రీసెంట్ గానే కొత్త షెడ్యూల్ ని కూడా చిత్ర యూనిట్ స్టార్ట్ చేసినట్టుగా టాక్ వచ్చింది.

మరి ఈ చిత్రంలో ఇటీవల ప్రభాస్ లేని సీక్వెన్స్ లు షూట్ చేస్తున్నట్టుగా సమాచారం రాగ ఇది కాకుండా కొన్ని వార్తలు ప్రభాస్ పై కొన్ని పెళ్లి సీన్స్ జరుగుతున్నాయని వార్తలు వైరల్ చేస్తున్నారు. అయితే ఈ సీన్స్ లో ఎలాంటి నిజం లేదు అన్నట్టుగా ఇప్పుడు టీం సన్నిహిత వర్గాలు నుంచి కన్ఫర్మ్ అయ్యింది.

అయితే మరో పక్క మేకర్స్ ప్రతి నెల ఇస్తామన్న రెగ్యులర్ అప్డేట్ కోసం అయితే రెబల్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు