తమిళనాడు ముఖ్యమంత్రి అలాగే దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లాస్ట్ సినిమాన్స్ జన నాయగన్. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ సినిమా గ్రాండ్ గా ఈ పాటికే విడుదల కావాల్సి ఉంది. బాలయ్య సూపర్ హిట్ భగవంత్ కేసరి కి రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమా పలు మార్లు వాయిదాలు మీద వాయిదాలు పడింది.
సరే విజయ్ సీఎం అయ్యాక ఇక లైన్ క్లియర్ అయ్యిందని అనుకుంటే అసలు ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మిగిలిపోయింది. ఇక నేడు విజయ్ పుట్టినరోజు అయినప్పటికీ సినిమా మేకర్స్ నుంచి అర్ధ రాత్రి సమయంలో అయినా ఓ అప్డేట్ ని అభిమానులు ఆశించారు. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి సౌండ్ లేదు. సో జన నాయగన్ థియేట్రికల్ రిలీజ్ డౌటే అనుకోవాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.


