ప్రభాస్ “కల్కి” నుంచి ఆగని లీక్స్.!

ప్రభాస్ “కల్కి” నుంచి ఆగని లీక్స్.!

Published on Feb 27, 2024 7:00 AM IST


పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక మాసివ్ మల్టీస్టారర్ లా లోక నాయకుడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలతో చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మరియు ఫాంటసీ డ్రామా “కల్కి 2898ఏడి”. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో ఆకట్టుకుంటుంది. కానీ ఈ మధ్య మాత్రం తరచుగా వరుస లీక్స్ వస్తుండడం గమనార్హం.

జస్ట్ కొన్ని రోజుల కితమే సినిమాలో ఓ సీన్ సంబంధించి లీక్స్ వైరల్ అవ్వగా ఇప్పుడు ప్రభాస్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ గెటప్ పై కొన్ని విజువల్స్ లీక్ అయ్యి వైరల్ అవుతున్నాయి. మరి ఇవన్నీ ఎలా వస్తున్నాయో మేకర్స్ కే తెలియాలి. ఇక ఈ భారీ చిత్రం రిలీజ్ మే 9న గ్రాండ్ గా ఉంటుంది అని అల్రెడీ ఫిక్స్ చేశారు. అలాగే సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు