బాలీవుడ్ జంటలపై ‘బాహుబలి’ బ్యూటీ కామెంట్స్ వైరల్.!

బాలీవుడ్ జంటలపై ‘బాహుబలి’ బ్యూటీ కామెంట్స్ వైరల్.!

Published on Apr 13, 2024 4:05 PM IST

బాలీవుడ్ సినిమా దగ్గర మంచి ఫేమ్ ఉన్నటువంటి గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహి (Nora Fatehi) కోసం తెలిసిందే. ఆమె మన తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ హిట్ “బాహుబలి 1” (Bahubali) లో మనోహరి సాంగ్ లో కనిపించి అలరించింది. ఇక ఫుల్ ఫ్లెడ్జ్ గా అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో “మట్కా” లో నటిస్తుండగా తాజాగా ఈమె బాలీవుడ్ జంటలపై చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి.

లేటెస్ట్ గా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ లో చాలా వరకు కపుల్స్ ఏమి ప్రేమలో లేరని వారంతా కేవలం తమ ఫేమ్ ని పెంచుకోడానికి తమ నెట్వర్క్ ని పెంచుకోవడం కోసం మాత్రమే ఇలా చేస్తున్నారు అని తెలిపింది. దీనితో బాలీవుడ్ లో ఉన్న పలు జంటల విషయంలో నార్త్ ఆడియెన్స్ కి మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి.

అలాగే మరికొందరు అయితే నోరా చెప్పింది అక్షర సత్యం అని కూడా అంటున్నారు. మొత్తానికి అయితే బాలీవుడ్ జంటల విషయంలో నోరా ఫతేహి చేసిన ఈ కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో బాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారిపోయాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు