శంకర్ కూడా కాదు ఆ ఒక్క దర్శకునితో ఎన్ని సినిమాలు అయినా ఓకే అంటున్న సదా!

sadaa and shankar

ఎర్లీ 2000 సమయంలో మన తెలుగు సినిమాని ఊపేసిన సినిమాల్లో మంచి లవ్ స్టోరీస్ తో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన హీరోయిన్స్ లో సదా కూడా ఒకరు. తెలుగులో వరుస హిట్స్ ని అందుకొని ఇతర భాషల్లో కూడా ఆమె చేసింది. తన కెరీర్ లోనే భారీ సినిమా దర్శకుడు శంకర్ తో అపరిచితుడు లాంటి బ్లాక్ బస్టర్ చేసినప్పటికీ ఆమె ఒక్క దర్శకుడుతో ఇప్పుడు వర్క్ చెయ్యాలి అంటే ఎవరిని ఎంచుకుంటారు అనే ప్రశ్నకు తనకి అవకాశం ఇచ్చిన దర్శకుడు తేజ పేరునే ఆమె చెప్పడం జరిగింది.

లేటెస్ట్ టీవీ షోలో ఆమె తను మళ్లీ కాదు ఎన్ని సార్లు అవకాశం వచ్చినా కూడా తేజ గారితోనే వర్క్ చేయడానికి ఇష్టపడతాను అని ఆమె మొహమాటం లేకుండా చెప్పడం విశేషం. తేజతో సినిమా చేసిన ప్రతీ సారి తన వర్క్ లో ఏదొక కొత్త విషయం నేర్చుకోవచ్చు అని ఆమె తెలిపింది. ప్రస్తుతం పలు టీవి షోస్, పర్శనల్ లైఫ్ లోనే ఆమె బిజీగా కొనసాగుతుంది.

Exit mobile version