నెంబర్ గేమ్స్ మీద ఆసక్తి లేదు: మహేష్ బాబు

నెంబర్ గేమ్స్ మీద ఆసక్తి లేదు: మహేష్ బాబు

Published on Jan 19, 2012 9:35 AM IST


వరుసగా ‘దూకుడు’ ఆ తరువాత ‘బిజినెస్ మేన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన మహేష్ బాబు తనకు నెంబర్ గేమ్స్ పై ఆసక్తి లేదన్నారు. ఇటీవల ప్రముఖ న్యూస్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ వెల్లడించారు. నటుడిగా ప్రతి సినిమాకి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తానని అన్నారు.

అదే నాకు కీలకం. ఒకసారి సినిమాలో జరిగిన పొరపాట్లని మళ్లీ జరగకుండా చూసుకుంటాను. నంబర్స్ కంటే అదే ముఖ్యమని అన్నారు. మహేష్ బాబు నటుడిగా ప్రతి సినిమాకి ఎదుగుతూనే ఉన్నారు. బిజినెస్ మేన్ సినిమాలో ఆయన నటన చూసిన ప్రతి ఒక్కరు ఆయనను అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా యువత నుండి విపరీతమైన స్పందన లభిస్తోంది. ఎ, బి, సి సెంటర్స్ లో ఈ చిత్రం కలెక్షన్ల తుఫాను సృస్తిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు