డ్యూయల్ రోల్ చేయడంలేదన్న హీరో !

డ్యూయల్ రోల్ చేయడంలేదన్న హీరో !

Published on Jun 29, 2017 4:41 PM IST


గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బడిపడుతున్న హీరో గోపిచంద్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. వాటిలో ఒకటి ‘గౌతమ్ నంద’. సంపత్ నంది దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఎప్పుడూలేని విధంగా ఈ సినిమాలో గోపిచంద్ కొత్తగా, చాలా స్టైలిష్ గా కనిపిస్తుండటం, టీజర్ కూడా బాగుంటుందట సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

వాటితో పాటే ఇందులో గోపిచంద్ డ్యూయెల్ రోల్ చేస్తారని, అందుకే ‘గౌతమ్ నంద’ అనే టైటిల్ ను నిర్ణయించారనే వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ వీటిపై స్పందించిన గోపిచంద్ మాత్రం అలాంటిదేమీ లేదని, తన పాత్రలో రెండు షేడ్స్ మాత్రమే ఉంటాయని క్లారిటీ ఇచ్చారట. అంతేగాక ఈ సినిమా తనకు మంచి కమ్ బ్యాక్ సినిమా అవుతుందని కూడా అన్నారు. పైగా సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరగడం, నైజాం ఏరియా హక్కుల్ని నిర్మాత దిల్ రాజు భారీ మొత్తం వెచ్చించి కొనడంతో క్రేజ్ కూడా తారా స్థాయిలోనే ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు