సూర్య 24 కాదు.. నాని కూడా ప్లాన్ చేసిన సినిమా ’24’.. వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ!

సూర్య 24 కాదు.. నాని కూడా ప్లాన్ చేసిన సినిమా ’24’.. వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ!

Published on Sep 23, 2026 2:00 AM IST

నాచురల్ స్టార్ నాని ఇప్పుడు ఓ స్టార్ హీరోనే కానీ తాను కూడా సినీ పరిశ్రమలో ఎంతో స్ట్రగుల్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే నాని హీరో కాకముందు ఓ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇదిలా ఉండగా తన ప్యారడైజ్ ప్రమోషన్స్ లో అప్పటి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నాడు. తాను అప్పట్లో దర్శకునిగా చేసేందుకు ఓ సినిమా రాసుకున్నట్టు తెలిపాడు.

పైగా దానికి 24 అనే టైటిల్ ని అప్పట్లో అనుకున్నాడట. 24 అంటే స్టార్ హీరో సూర్య టైం ట్రావెల్ సినిమా అందరికీ గుర్తొస్తుంది. కానీ నాని రాసుకున్న సినిమా మాత్రం ఒక యాక్షన్ సబ్జెక్టు అట. అప్పుడు దర్శకునిగా ఆ సినిమా చేయాలి అనుకున్నాను కానీ కాలం ఇప్పుడు తనని హీరోగా మార్చింది అని తెలిపాడు.

ఒకవేళ ఇప్పుడు ఎవరైనా దర్శకుడు ఆ సినిమా చేయాలి అనుకుంటే తన స్క్రిప్ట్ ఇవ్వడానికి సిద్ధమే అని నాని తెలిపాడు. అంతే కాకుండా ఇప్పటికీ మొత్తం స్క్రిప్ట్ తన దగ్గర ఉంది అని అప్పుడు రాసుకున్న స్టోరీ కాబట్టి ఇప్పుడుకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేయాలని నాని అసలు విషయం రివీల్ చేసాడు. మరి ఈ స్క్రిప్ట్ ని ఎవరైనా దర్శకుడు తీసుకొని చేస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు