స్టార్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత !

Published on Jun 1, 2020 11:00 am IST

బాలీవుడ్‌ లో మాస్ సాంగ్స్ కు కేరాఫ్ గా నిలిచిన ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు వాజీద్ ఖాన్(42) ఆదివారం రాత్రి ముంబైలోని చెంటూర్ ఆసుప‌త్రిలో తుది శ్వాస విడిచారు. కిడ్నీ వైఫల్యం అనారోగ్యం వల్ల ఆయన 42 ఏళ్లకే కన్నుమూశారు. వాజిద్ ఖాన్ హఠాన్మరణం పట్ల బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.

ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. కొన్ని నెల‌ల క్రితం కిడ్నీ మార్పిడి చేసుకున్న ఆయన క‌రోనా బారిన ప‌డ్డారు, చివరికీ ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. ఆయన బాలీవుడ్‌కు ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు. లాక్‌డౌన్‌లోనూ హీరో స‌ల్మాన్ ఖాన్ “భాయ్ భాయ్” పాట‌‌కు సంగీతం అందించడం విశేషం.

ఆయ‌న మ‌ర‌ణం సంగీత ప్ర‌పంచానికి తీర‌ని లోటు.మంచి ప్ర‌తిభావంతుడిని కోల్పోయింది బాలీవుడ్. 123తెలుగు.కామ్ తరఫున వాజీద్ ఖాన్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :

More