‘సైరా’ శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్.. 125 కోట్లు !

‘సైరా’ శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్.. 125 కోట్లు !

Published on Sep 17, 2019 9:23 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ టీవీ ఛానల్, జీ టీవీ ఈ చిత్రం యొక్క శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ ను 125 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగాల్సి ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 18 నుండి 22కి పొస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు