‘కరుప్పు’లో ఆ హీరో క్యామియో ఎపిసోడ్.. ఓటిటిలో ఉండొచ్చా?

‘కరుప్పు’లో ఆ హీరో క్యామియో ఎపిసోడ్.. ఓటిటిలో ఉండొచ్చా?

Published on Jun 3, 2026 11:30 PM IST

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రమే “కరుప్పు”. తెలుగులో “వీర భద్రుడు” పేరిట రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా రెండు వెర్షన్ లలో కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో ఆర్జే బాలాజీ ప్లానింగ్ కి కొన్ని సీన్స్ తో థియేటర్స్ లో మంచి ట్రీట్ అయితే ఫ్యాన్స్ కి ఆడియెన్స్ కి దక్కిన సంగతి తెలిసిందే.

కొన్ని ఇతర సినిమాల రిఫరెన్స్, క్రాసోవర్స్ లాంటివి మంచి ఫీస్ట్ గా నిలిచాయి. ఇవి కాకుండా ఇంకో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఇపుడు రివీల్ అయ్యింది. ఈ సినిమాలో కోలీవుడ్ ప్రముఖ హీరో ఆర్య కూడా ఓ కీలక క్యామియో రోల్ లో నటించాడట. కానీ నిడివి సమస్యలతో ఆ సీన్స్ ని తీసేసినట్టు ఎడిటర్ ఆర్ కలైవనన్ రివీల్ చేశారు. అయితే ఈ సీన్స్ ని బహుశా డిలీటెడ్ సీన్స్ గా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.

ఒకవేళ ఇలా వస్తే డెఫినెట్ గా ఓటిటిలో కూడా ఇవి ఉండొచ్చు అని చెప్పొచ్చు. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఇందులో సినిమా స్ట్రీమింగ్ కి రానుంది.

తాజా వార్తలు