దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థకి “పుష్ప 2”, విజయ్ “గోట్” ఓటీటీ హక్కులు

దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థకి “పుష్ప 2”, విజయ్ “గోట్” ఓటీటీ హక్కులు

Published on Feb 29, 2024 9:42 PM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మంచి అవైటెడ్ గా ఉన్న పలు భారీ చిత్రాల్లో మన టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం “పుష్ప 2” ఒకటి కాగా మరో చిత్రం తమిళ్ నుంచి దళపతి విజయ్ మరియు దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం “గోట్”(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) కూడా ఒకటి. మరి ఈ రెండు సినిమాలు ఇప్పుడు షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసుకుంటున్నాయి.

ఇక లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లు తాలూకా ఓటీటీ హక్కుల సంబంధించి సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ రెండు సినిమాల స్ట్రీమింగ్ హక్కులని కూడా దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత ఓటీటీలో అయితే అందులో రానున్నాయి. మొత్తానికి అయితే ఈ సినిమాల విషయంలో ఇప్పుడు అందరికీ ఓ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. ఇక పుష్ప 2 కి దేవిశ్రీప్రసాద్ సంగీతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం అందిస్తున్నారు అలాగే గోట్ కి యువన్ శంకర్ రాజా సంగీతం, ఏ జి ఎస్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు